![]() |
![]() |

జబర్దస్ కామెడీ షో తెలుగు ఆడియన్స్ మనసుల్ని దోచుకుంది. పదేళ్ల నుంచి నిర్విరామంగా నవ్విస్తూనే ఉంది ఈ షో. ఈ షో ద్వారా ఎంతోమంది గుర్తింపు తెచ్చుకున్నారు, తెచ్చుకుంటూనే ఉన్నారు. ఈ వేదిక మీదుగా లవర్స్ ఐనవాళ్లు ఉన్నారు..రీల్ జోడీస్ కూడా ఉన్నారు. ఇక కడుపుబ్బా నవ్వించడానికి చాలా మంది కమెడియన్స్ ఉన్నారు..కొంతమంది వెళ్లిపోగా వాళ్ళ ప్లేస్ లోకి ఇంకొంతమంది వచ్చి ఎంటర్టైన్ చేస్తున్నారు. జబర్దస్త్ జోడీస్ లో ఫస్ట్ ప్లేస్ ఎప్పటికీ సుడిగాలి సుధీర్ - రష్మీ జంటదే..తర్వాత ఎంతో మంది జోడీస్ వచ్చారు స్టేజిని కళకళలాడిస్తూ ఉన్నారు. అందులో చెప్పుకోదగ్గ మరో జంట నూకరాజు-ఆసియా. వీళ్ళు పటాస్ కామెడీ షోతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు జంటగా వీడియోలు చేస్తూ టూర్స్ కి వెళ్తూ రచ్చ చేస్తున్నారు.
వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఈ స్టేజి మీద రీల్ జోడీగా ఎన్నో స్కిట్ లు చేశారు.. రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుంటామని ఎప్పటినుంచో చెపుతూనే ఉన్నారు. రెండు కుటుంబాల పెద్దలు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. కానీ ఇప్పుడు జరిగిన ఒక సీన్ చూస్తే ఫుల్ షాకింగా అనిపించింది. లేటెస్ట్ గా ‘జబర్దస్త్’ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా నూకరాజు తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నే స్కిట్ గా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ స్కిట్ లో నూకరాజు-ఆసియా తల్లిదండ్రులు కూడా ఇందులో భాగమయ్యారు.
స్కిట్ అంతా పూర్తయ్యాక ఇంద్రజ మాట్లాడుతూ"ఇంత దూరం తీసుకొచ్చారు తాంబూలాలు ఇచ్చుకునే టైంలో అలా కట్ చేసి వదిలేశారేమిటి" అని అడిగేసరికి "మేడం ఇది స్కిట్ వరకే అన్నారు నిజంగా ఐతే ఈ పెళ్లి చేయడం కుదరదు" అని నూకరాజు వాళ్ళ అమ్మ చాలా సీరియస్ గా చెప్పేసరికి ఆసియా ఒక్కసారిగా షాకయ్యింది ఆ మాటలకు. ఆ తర్వాత అందరూ స్టన్ అయ్యారు. అయితే నూకరాజు-ఆసియా లవ్ స్టోరీకి బ్రేక్ వేయడం అంతా కూడా స్కిట్ లో భాగంగానే చేశారా లేదా నిజంగానే వీళ్ళ పెళ్ళికి బ్రేక్ పడబోతోందా తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయక తప్పదు.
![]() |
![]() |